Nara Chandrababu Naidu

Nara Chandrababu Naidu Instagram – రాష్ట్రంలో పోలింగ్ అనంతరం వైసీపీ రౌడీల దాడులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలం అవుతున్నారు. ఇప్పుడు ఈ హింస ప్రశాంతమైన విశాఖకు కూడా చేరింది. నగరంలోని నార్త్ నియోజకవర్గంలో వైసీపీ ఇచ్చిన డబ్బులను నిరాకరించి…టీడీపీకి ఓటు వేశారన్న కారణంతో నలుగురిపై దారుణంగా దాడిచేశారు. ఆడవాళ్లపై కూడా పాశవిక దాడికి పాల్పడ్డారు. వైసీపీ మూకలు చేస్తున్న దాడుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి.

పల్నాడులో ఇప్పటికీ సమస్య పరిష్కారం రాలేదు. వైసీపీ రౌడీ మూకలు ఇళ్లలో బాంబులు, మారణాయుధాలు పెట్టుకుని దాడులకు తెగబడుతున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి గూండాలను అరెస్టు చేయాలి. మాచర్లలో మారణహోమానికి కారణం అయిన ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసులు పెట్టి వెంటనే అరెస్టు చేస్తే తప్ప అక్కడ దాడులు ఆగే పరిస్థితి లేదు.

అలాగే విజయవాడ భవానీపురంలో పోలింగ్ రోజు జరిగిన దాడి కేసులో నిందితుడు… పోలీసుల అదుపులో ఉన్న వైసీపీ నేత స్టేషన్ నుంచి పారిపోవడం పోలీసుల ఉదాసీన వైఖరికి నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల హింసలో నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపాలి. తప్పు చేసిన పోలీసు అధికారులను బదిలీ చేయడమే కాకుండా… వారిపై కూడా కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.
#YSRCPRowdyism | Posted on 16/May/2024 18:45:53

Nara Chandrababu Naidu
Nara Chandrababu Naidu

Check out the latest gallery of Nara Chandrababu Naidu